Life Quotes in Telugu – Quotes On Life in Telugu Language
Life Quotes in Telugu
జీవితం అంటే నిన్ను నువ్వు చూసుకోవటం కాదు, నిన్ను నువ్వు రూపు దిద్దుకోవటం.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
ఇతరులతో నిన్ను నువ్వు పోల్చుకోవటం ఆపినపుడు నీవు నీ అసలైన జీవితపు ఆనందాన్ని పొందుతావు.
నీకు కావలసిన దాని కోసం శ్రమించకుండా, పోగొట్టుకున్న దాని గురించి ఏడవటం మూర్ఖత్వం అవుతుంది.
అర్థరహితమైన మాటలకన్నా, అర్థవంతమైన నిశ్శబ్దం చాలా గొప్పది.
ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించటం, ఎక్కువగా ఆశించటం ఫలితంగా వచ్చే బాధ కుడా ఎక్కువగానే ఉంటుంది.

జరిగిన దాన్ని గురించి ఎప్పుడూ చింతించకు. ఎందుకంటే, మనకు జరిగే మంచి మనకు ఆనందాన్ని ఇస్తే జరిగిన చెడు అనుభవాన్ని ఇస్తుంది.
నిరాశావాది తనకు వచ్చిన అవకాశంలో కష్టాన్ని చుస్తే, ఆశావాది కష్టంలో అవకాశం కోసం వెతుకుతాడు.
జీవితం చాలా కష్టమైన పరీక్ష. దానిలో చాలామంది విఫలం చెందటానికి కారణం, ప్రతీ ఒక్కరి ప్రశ్నాపత్రం వేరని గ్రహించకపోవటమే.
కాలం నువ్వు కలిసే వ్యక్తులను నిర్ణయిస్తుంది, హృదయం మీరు కోరే వ్యక్తులను నిర్ణయిస్తుంది, మీ ప్రవర్తన మీతో ఉండే వారిని నిర్ణయిస్తుంది.
నేను ఎంచుకున్న దారి విభిన్నంగా ఉండవచ్చు దాని అర్థం నేను తప్పిపోయానని కాదు.

నీవు ఎప్పుడూ పొందనిది నీకు కావాలంటే నీవు ఎప్పుడూ చేయని కృషి చేయాలి.
ఏడ్చనివాడు బలశాలి కాదు, ఏడ్చినా తిరిగి లేచి సమస్యలను ఎదుర్కొనేవాడు బలమైన వాడు.
నిరంతరం వెలుగునిచ్చే సూర్యున్ని చూసి చీకటి భయపడుతుంది. అలాగే నిరంతరం కష్టపడేవాడిని చూసి ఓటమి భయపడుతుంది.
ఒక్క అడుగు ప్రారంభిస్తే వేయి మైళ్ళ ప్రయాణమైనా పూర్తి అవుతుంది.

అంధకారంలో ఉన్న ప్రపంచానికి వెలుతురు ఇవ్వాలంటే మనం దీపంగా మారాలి. లేదా ఆ కాంతిని ప్రతిబింబించ గలిగే అద్దంగా అయినా మారాలి.
అమ్మ ప్రేమకు ప్రతిరూపం, పదిలంగా కాపాడుకో. ఆమెను శాశ్వతంగా పోగొట్టుకున్నప్పుడే ఆమె లేని లోటు ఎంత దుర్భరమో నీకు తెలుస్తుంది.
మన అజ్ఞానం గురించి తెలుసుకోవడమే నిజమైన జ్ఞానము.
అడ్డంకులకు కృంగిపోయేవారికి ఎప్పుడూ అపజయమే వరిస్తుంది. విజయం లభించాలంటే వాటినే అనుభవాలుగా మార్చాలి.
ఆలస్యం చేస్తే సులభమైన పని కష్టం అవుతుంది. అలాగే కష్టమైన పని అసాధ్యంగా మారుతుంది.
పదిమంది మనం చేసే ప్రతీ పనిని ప్రశంసించాలని ఆరాటపడటం వల్ల మనలోని బలహీనత బయటపడుతుంది.
మన ఆత్మీయులతో పంచుకుంటే సంతోహం రెట్టింపవుతుంది. అలాగే విషాదం సగం అవుతుంది.
అసలే ప్రారంభించకుండా ఉండటం కన్నా ఆలస్యంగా ప్రారంభించటం ఎంతో ఉత్తమం.
ఆత్మ విశ్వాసం లేకపోవటం అపజయాలకు గల ముఖ్య కారణం.
కాలం విలువ తెలియని వాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు.
మనిషిలో ఉత్సాహం పగటి వెలుతురును ప్రసరింపజేస్తుంది, అంతేకాక మనస్సును నిరంతరం పవిత్రతతో నింపుతుంది.
Recent Comments